Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 16 సంగారెడ్డి జిల్లా

కలియుగ దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు. బుధవారం సుప్రభాత సేవలో ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. వైకుంఠ వాసుడు, దేవదేవుడు శ్రీనివాసుడు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.