

జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్, వైసీపీ, బీఎస్పీలతో కలిసి ముస్లింలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ విధానాలు మానుకోవాలన్నారు. మత సామరస్యం, లౌకిక తత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అర్ధరాత్రి తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.