

జనం న్యూస్ 16 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన పత్తిగిల్లి దిలీప్ కుమార్ మార్చి 30న వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ సిటీ బస్టాండు వద్ద గా గాయత్రి మెటల్ మార్ట్ షాపు నందు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి 240 కిలోల రాగి, 160 కిలోల ఇత్తడి, మూడు ఇన్వెర్టరీ బ్యాటరీలు చోరికి గురైనట్లుగా ఫిర్యాదు చెయ్యగా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరంకు పాల్పడిన పెందుర్తి మండలం చిన ముసిడివాడ గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన (1) పెండ్ర నాయుడు @ పోతురాజు (34 సం.లు) (2) పెండ్ర దర్శన్ బాబు (21 సం.లు) అనే ఇద్దరిని ఏప్రిల్ 15న అరెస్టు చేసి, వారి వద్ద నుండి 120 కిలోల రాగి, 80 కిలోల ఇత్తడి ముక్కలను రికవరీ చేసినట్లు గా వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. నిందితులను అరెస్టు చేయుట, చోరీ సొత్తు రికవరీ చేయుటలో ఎస్సై బి.సురేంద్ర నాయుడు, హెచ్.సి. రమణారావు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, గౌరీ శంకర్ క్రియాశీలకంగా పని చేశారని సిఐ శ్రీనివాస్ తెలిపారు.