Listen to this article

క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి: జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో ఆధునికరించిన బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ కోర్ట్ లను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమని, ఒత్తిడిని తగ్గించుకొనేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. పోలీస్ శాఖకు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమని తెలిపారు.
జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, ఇవి నిత్యజీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోలీసులకు క్రీడలు నిత్యజీవితంలో చాలా ముఖ్యమని, బ్యాడ్మింటన్ కోర్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర రావు, ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్, సింగరేణి జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి, ఆర్.ఐ లు పెద్దన్న,అంజన్న, సిఐలు రవీందర్, శ్రీధర్, ఇతర పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.