

జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఎవరైనా వ్యక్తులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా మిస్ అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు గత మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 50 మంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మొబైల్ ఫోన్లు అందుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ ల వారీగా
ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ – 8, కాగజ్ నగర్ టౌన్ 10, కేరమేరి 3, వాంకిడి 3, రెబ్బెన 8, కౌటాల 7, కాగజ్ నగర్ రూరల్ 3, మొత్తం 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు ఈరోజు అప్పగించడం జరిగింది. అందుకున్న బాధితులు జిల్లా ఎస్పీ గకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరస్తులు దొంగలించిన మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఆర్ ప్రభాకర రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐ.టి కోర్ ఎస్ ఐ లు,సౌమ్య, తెజేశ్విని, ఐటీ కోర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
