

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఫొటోస్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని పీజీ కోర్సులు ఎంఏ తెలుగు ,ఎంఏ ఇంగ్లీషు, ఎం కామ్, కోర్సుల మొదటి మరియు మూడవ సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే . సంపత్ కుమార్ ,(COE),అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ టి . సంపత్ (ACOE) ల చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో విడుదల చేశారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే అశోక్, కళాశాల సి . ఓ.ఈ.డాక్టర్ జి వెంకటేశం , ఏ .సి .ఓ .ఈ .వై. సంజీవరెడ్డి పాల్గొన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.