

న్యూస్ ఏప్రిల్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను తనిఖీ చేశారు ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ నందు బాలికలకు అన్ని వసతులు కల్పిచాలని ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంట గదిని పరిశుభ్రముగా ఉంచుకోవాలని, కూరగాయలు, పాలు ఎప్పుడు తాజాగా ఉండే విధముగా చూసుకోవాలని సరుకులు, కూరగాయలు వెలుతురూ తగిలే ప్రదేశంలో నిల్వ చేసుకోవాలని, మరుగు దొడ్లు పరిశుభ్రముగా వాటికీ తలుపులు ఉండే విధముగా చూసుకోవలని అన్నారు. జడ్.పి యస్ యస్ స్కూల్ ను సందర్శించి పిడిఎస్ బియ్యమును పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం ద్వారా వండిన అన్నం పెట్టాలి అని అన్నారు.
