

జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
పోషణ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. పోషణ జాతరలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, చేతుల పరిశుభ్రత, మిషన్ భగీరథ నీటి ప్రాధాన్యత ప్రయోగం వంటివి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన చిన్నారులకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. అంగన్వాడీ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన కూరగాయల సంత ను పరిశీలించి వారి నుండి కూరగాయలు కొనుగోలు చేశారు.పోషణ పక్వాడలో భాగంగా పోషణ జాతరను పరిశీలించిన అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. 25 మంది గర్భిణీలకు సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ పక్వాడలో భాగంగా ఈనెల 22 వరకు పపోషకాహార ప్రాధాన్యతను తెలిపే కార్యక్రమాలు నిర్వహించాలని, అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, మెప్మా పిడి వేణు మాధవ్, డిప్యూటీ డిఎంహెచ్వో చందు, తహసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, సిడిపిఓ సుగుణ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
