

రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం
గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక
జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
భద్రాచల సీతారాముల కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనచరిత్ర కల్గిన శ్రీరామకోటి భక్త సమాజం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈ నెల 22న జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కళ్యానానికి కూడా గోటి తలంబ్రాలు అందించాలని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం నాడు అడిషన్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రియాంక, గోటి తలంబ్రాల కార్యక్రమం పాల్గొని రామనామ స్మరణ చేస్తూ వడ్లను ఓలిచి తలంబ్రాలుగా చేసి రామకోటి రామరాజు,కి అందజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ గోటి తలంబ్రాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టం అన్నారు. రామకోటి రామరాజు కృషివల్లే భద్రాచల రాములవారి కల్యానానికి కూడా గోటి తలంబ్రాలు అందించానని, అదే విదంగా గజ్వేల్ లో జరిగే సీతారామ, ఉమామహేశ్వరుల కళ్యానానికి కూడా భక్తితో ఓలిచి అందంచానన్నారు. రామభక్తితో రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి, అందరిని ఇందులో భాగస్వాములను చేయడం అయన రామభక్తి అభినందనీయం అన్నారు.
