Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం

గత ప్రభుత్వంలో భూమి రికార్డులు తారుమారు, వాటి వల్ల ఇబ్బంది పడుతున్న భూ యజమానులు వారి కుటుంబ సభ్యులు లంక ఆదినారాయణ,రమణ,సూరిబాబు వలంక ధర్మవరంలో గ్రామ ప్రధాన రహదారి, ప్రధాన పంట కాలువలు,గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి మాన్యం, అనేక సర్వే నెంబర్లలో గల మొత్తం 12 ఎకరాల భూమిని ప్రస్తుతం మార్కెట్లో రూ.30 కోట్ల విలువ చేసే భూమిని దౌర్జన్యంగా,అక్రమంగా కొందరు వ్యక్తులతో పాటు 2019లో అచ్యుతాపురం తహసీల్దార్ గా పనిచేసిన కృష్ణమూర్తి రెవెన్యూ సిబ్బంది తప్పుడు పత్రాలు సృష్టించి మా కుటుంబ సభ్యుల్ని, గ్రామ ప్రజలను ఆర్థికంగా మానసికంగా గత పది సంవత్సరాలుగా వేధిస్తున్నారని ఈ సమస్య పై పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని రైతు విసుగు చెంది సెల్ టవర్ ఎక్కి పెట్రోల్,లైటర్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని లేకపోతే చనిపోతానని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.