

అయ్యప్ప ఆలయ కార్యదర్శి జయంధర్ తన పద్దతి మార్చుకోవాలి..
అయ్యప్ప గురు స్వాములు అయిత విజయ్ కుమార్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట అయ్యప్పస్వామి దేవాలయం అధ్యక్షునిగా తనకు తాను ప్రకటించుకున్న కార్యదర్శి సిరిమల్లె జయందర్, భక్తుల పట్ల గురుస్వాముల పట్ల అమర్యాదగా అనుచితంగా, ప్రవర్తించడాన్ని అయ్యప్ప గురుస్వాముల భక్తులుగా అయిత అజయ్ కుమార్ తీవ్రంగా ఖండిస్తున్నాం, అన్నారు.ఇ సందర్బంగా మాట్లాడుతూ.. విషు పర్వదిన సందర్భంగా గత 36 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష తీసుకుని ఎంతోమందికి శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేయించిన, ఇమ్మడి భాస్కర్ గురుస్వామి ఆలయానికి దర్శనము కోసం పోగా ప్రసాదం పెట్టకపోగా ప్రశ్నించిన భాస్కర్, గురుస్వామిని, జయంధర్ ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించాడాన్ని అయ్యప్పస్వామి భక్తులైన మేము ఖండిస్తున్నాం.అన్నారు.జయంధర్ తన అనుచరులచే వాట్సప్ గ్రూప్లలో భాస్కర్ గురుస్వామిని బెదిరింపులకు గురిచేయడం, రాత్రి భాస్కర్ గురుస్వామి ఇంటి ముందు అలజడి సృష్టించడం, ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాము అన్నారు.సిరిమల్లె జయంధర్ అయ్యప్ప ఆలయానికి కార్యదర్శిగా ఉంటూ అధ్యక్షుడైన యాంసాని కృష్ణమూర్తి రాజీనామా చేశాడని చెబుతూ తనకు తానుగా అధ్యక్షునిగా ప్రకటించుకున్నారన్నారు. కార్యవర్గసమావేశము పెట్టకుండా తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడని తెలిపారు. అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులను పదవులిచ్చి గతంలో లక్షలాది రూపాయలు చందాలిచ్చిన వారిని ఆలయంలో జరిగే ఉత్సవాలకు సైతం ఆహ్వానించడం లేదు అని వివరించారు. జయంధర్ వైఖరి ప్రశ్నించలేని, జమ్మికుంట పట్టణానికి చెందిన అయ్యప్పస్వామి భక్తులు ఆలయనిర్మాణానికి సహకరించిన వారు సైతం ఆలయానికి పోక తమలోతాము బాధ పడ్తున్నారని మాట్లాడారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలతో పాటు వచ్చిన చెందాలు, లెక్కలు కూడా తమకు తెలపడం లేదని, కార్యవర్గ సభ్యులు సైతం అతని ప్రశించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రశ్నించిన వారిని ఏదో విధంగా అవమానపరుస్తూ, గుడికి రాకుండా చేస్తున్నారని భక్తులు వాపోతున్నారన్నారు. జమ్మికుంట పట్టణంలో అయ్యప్ప స్వామి దీక్షలు గత 18 సంవత్సరాలుగా పైగా తీసుకున్న భక్తులు గురు స్వాములు ఎంతోమంది ఉన్నారన్నారు. వారందరూ కూడా జయేందర్ వైఖరి చూడలేక ఆలయానికి పోలేక తమలోతామే మదన పడుతున్నారన్నారు. ఇకనైనా సిరిమల్లె జయంధర్ తన వైఖరిని మార్చుకొని కార్యవర్గ సమావేశం పెట్టి అధ్యక్షున్ని ఎన్నుకోవాలని కోరుతున్నాము అని తెలిపారు.
గత కార్యవర్గంలో మరణించిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు.లేనిచో జయంధర్ వైఖరికి నిరసనగా ఆలయంలో నిరసన తెలుపుతామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు గురుస్వాములు అయిత విజయకుమార్,గందె రాజు, యాద సతీష్,ఆకినపల్లి మురళి, మద్ది రాజన్న,ముక్కశివప్రసాద్,కొండ్ల పాపయ్య,ఇమ్మడి రాము, బచ్చుశివకుమార్,యాంసాని సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు.