

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమదేవరపాలెం కు చెందిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ముమ్మడివరం బల్లగేటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో కూటమి నాయకుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, ఆయనకు శాలువా కప్పి పూల గుచ్చాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఉచితముగా పేదలకు ఏర్పాటు చేశారు తదుపరి నగర పంచాయతీలో కౌన్సిలర్ల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి సోమదేవరపాలెం ఆయన గృహమునందు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఫోన్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు,నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ మరియు కౌన్సిలర్ ములపర్తి బాలకృష్ణ, మున్సిపల్ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ రవి వర్మ ,కట్టా సత్తిబాబు, దొమ్మేటి రమణ కుమార్, గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, శ్రీను రాజు, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, పెదపూడి రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి ,ముమ్మిడివరపు వరలక్ష్మి, ప్రసన్న, తొత్తరమూడి జ్యోతి బాబు,కటికీదల నని,కురశాల శివ,సత్తి నూకరాజు,మొదలగు వారు పాల్గొన్నారు.
