

జనం న్యూస్ 17 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి రెండవ సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం గురించి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి SAM, MAM గురించి చెప్పడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతము ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ చంద్రకళ, ఈశ్వరమ్మ, VOA అనిత, ఉమాదేవి, లక్ష్మి, శ్రీకళ, శిరీష, సరళ, శశికళ, కవిత, ప్రవళిక, మమత, జ్యోతి, మరియు నానమ్మలు, తాతలు, కిశిరబాలికలు, పిల్లలు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
