Listen to this article

జనం న్యూస్ , ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తయిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని ఎన్నికల అధికారి గా, జిల్లా సహకార అధికారి కార్యాలయ సిబ్బంది అనూష పర్యవేక్షకులుగా మండల సమాఖ్యలో నూతన అధ్యక్షులు, చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య సభ్యులు అందరూ కలిసి జిల్లా సమైక్య నూతన పాలకవర్గ సభ్యుల నియామకం చేశారు. జిల్లా సమాఖ్య పాలక వర్గం సభ్యుల నుంచి పదాదికారులు గా పాలకుర్తి మండలం నుంచి ఎస్.స్నేహ అధ్యక్షురాలిగా, ముత్తారం మండలం నుంచి జే. శోభ కార్యదర్శి, పెద్దపల్లి మండలం నుండి జి.స్వప్న కోశాధికారిగా నియమితులయ్యారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జె. రవి కుమార్, డిపిఎం కె.రవి, జిల్లా సమాఖ్య సిబ్బంది అన్ని మండల సమాఖ్య నూతన అధ్యక్షులు పాల్గొన్నారు.