Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయని జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ ద్వారా భారత గౌరవ టూర్ పేరుతో ప్రత్యేకంగా దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను హైదరాబాద్ నుంచి పర్యటనకు ప్యాకేజీలు తయారు చేసిందని, వీటిలో ట్రైన్ జర్నీ బస్ జర్నీ హోటల్ భోజన ఖర్చులు, గైడ్ తో సహా సైట్ సీయింగ్ ఉంటాయని అన్నారు.భారత గౌరవ టూర్ లో భాగంగా హైదరాబాద్ నుంచి ఐదు ప్యాకేజీ లలో ప్రత్యేక ట్రైన్లు ఉన్నాయని తెలిపారు. మొదటి ప్యాకేజ్ కింద ఏప్రిల్ 23 నుంచి మే రెండు వరకు 9 రాత్రులు , 10 రోజులలో హరిద్వార్, రిషికేష్ వైష్ణవ దేవి, ఆనంద్ పూర్, నైనా దేవి, అమృత్ సర్ పర్యాటక ప్రాంతాలను చేయడం జరుగుతుందని, ప్రతి మనిషి 18 వేల 150 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. రెండవ ప్యాకేజ్ కింద మే 8 నుంచి మే 17 వరకు 9 రాత్రులు , 10 రోజులలో వారణాసి, పూరి ,గయా, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ,కోణార్క్ పర్యాటక ప్రాంతాలను చేయడం జరుగుతుందని, ప్రతి మనిషి 16 వేల 800 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. మూడవ ప్యాకేజ్ కింద మే 22 నుంచి మే 30 వరకు 8 రాత్రులు , 9 రోజులలో అరుణాచలం, రామేశ్వరం, తంజావూర్, కన్యాకుమారి, త్రివేండ్రం , త్రిచి, మదురై పర్యాటక ప్రాంతాలను చేయడం జరుగుతుందని, ప్రతి మనిషి 14 వేల 700 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. నాల్గవ ప్యాకేజ్ కింద జూన్ 4 నుంచి జూన్ 12 వరకు 8 రాత్రులు , 9 రోజులలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, ఘృశ్నేశ్వర్, ఎల్లోరా, మోహం, నాగ్ పూర్ పర్యాటక ప్రాంతాలను చేయడం జరుగుతుందని, ప్రతి మనిషి 14 వేల 700 రూపాయల ఖర్చు అవుతుందని అన్నారుభారత రైల్వే సంస్థ నిర్వహిస్తున్న భారత గౌరవ టూర్ లో పాల్గొనాలి అనుకుంటే www.irctctourism.com వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో లేదా సికింద్రాబాద్ రోడ్డు లోని ఐ.ఆర్.సి.టి.సి, మూడవ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, సికింద్రాబాద్ నందు బుక్ చేసుకోవాలని, ఇతర వివరాలకు 04027702407, 9701360701, 9281495845, 9281495843, 9281030750, 9281030740 ఫోన్ నెంబర్లను అంత సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.