Listen to this article

మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త.

ఏపీ స్టేట్ బ్యూరో, ఏప్రిల్ 17, (జనం న్యూస్):

మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డిని గత సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం శాసన సభ్యులుగా ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. నియోజకవర్గాల మార్పు సమయంలో మార్కాపురం నియోజకవర్గ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ తప్పని పరిస్థితులలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ మార్కాపురం నియోజకవర్గంలో కుందురు నాగార్జునరెడ్డి ఏకార్యక్రమానికి వచ్చిన ప్రజలు నీరాజనం పలకడం అనేది రాజకీయ నాయకుడు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. మార్కాపురం నియోజకవర్గ ప్రజల మనసులలో కుందురు నాగార్జున రెడ్డి చిరస్థాయిగా నిలవడానికి ఆయన చేసిన అనేక మంచి కార్యక్రమాలు, అన్ని కులాల మతాలను సమాన భావంతో చూడడం, నియోజకవర్గస్థాయిలో ఏ కార్యకర్త పని అడిగిన తక్షణమే చేయడం అనేది కుందురు నాగార్జునరెడ్డి లాంటి అవినీతి రహిత ప్రజారంజిక పరిపాలకులకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మార్కాపురం నియోజకవర్గంలో జనం మరవని నాయకుడిగా చిరస్థాయిగా అన్ని కులాల మతాల ప్రజలలో అభిమానం పొందినారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కుందురు నాగార్జున రెడ్డి లాంటి నాయకులు ఇప్పటికీ నియోజకవర్గ స్థాయిలో కులాలకు మతాలకు అతీతంగా పిలిచిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నూతన రాజకీయాలలో కొత్త అధ్యయనం ప్రారంభించారని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు నియోజకవర్గస్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుల కార్యక్రమాలకు హాజరు కావడం అనేది ఆనవాయితీ. కానీ కుందురు నాగార్జునరెడ్డి లాంటి ప్రజా నాయకులు నియోజకవర్గస్థాయిలో ఏచిన్న కార్యకర్త ఆహ్వానించినప్పటికీ వారి ఇంటికి వెళ్లి వాళ్ళింట్లో జరిగే శుభకార్యములో పాల్గొనడం అనేది ప్రస్తుత రాజకీయాలలో ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి గొప్ప నాయకుడు మన కుందురు నాగార్జున రెడ్డి అని చెప్పటానికి గర్వంగా ఉంటుంది. నియోజకవర్గంలోని ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కు కావలసినది ముఖ్య నాయకుల వద్ద గౌరవము ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫోన్ అండ్ మెసేజ్ చేసినప్పుడు స్పందించే నాయకుడిని ఇష్టపడతారు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేసే నాయకున్ని ఇష్టపడతారు. కుల మతాలకు అతీతంగా దగ్గర గుర్తు పెట్టుకుని మాట్లాడే నాయకున్ని ఇష్టపడతారు. మనము ఎక్కడ కనిపించిన మన పేరు పెట్టి మన యోగ క్షేమాలు గురించి తెలుసుకునే నాయకుడిని ఇష్టపడతారు. మనము అత్యవసరంలో సహాయం కోరినప్పుడు మనల్ని ఆపదలో ఆదుకునే నాయకుని ఇష్టపడతారు. నియోజకవర్గంలో అవినీతి రహిత ప్రజా నాయకుడిని అందరూ ఇష్టపడతారు. మనకు చేసే సహాయములో ఏమి ఆశించని నాయకున్ని ఇష్టపడతారు. ఇలా ఎన్నో మంచి సంపూర్ణ లక్షణాలు కలిగిన పశ్చిమ ప్రకాశంలోనే కుందూరు పెద్ద కొండారెడ్డి కుటుంబంలోని రాజకీయ నాయకున్ని నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు జనం ఎప్పటికీ మరవరని చెప్పవచ్చు.