Listen to this article

జనం న్యూస్ 18ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయము లో మండల పరిధి లో గల 23 గ్రామ లలోని ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సభ్యులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ కు సంబంధించిన విధి విధానాల పై పలు సూచనలు చేశారు. ఇట్టి సమావేశంలో మండల తహసిల్దార్ బి రవీందర్ మండల పంచాయతీ అధికారి ఎమ్ మహేందర్ అసిస్టెంట్ ఇంజనీర్( పిఆర్ ) సయ్యద్ శంషీర్ అలీ 23 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పలువురు నాయకులుమరియు తదితరులు పాల్గొన్నారు.