Listen to this article

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం
మద్దూర్:మండల పరిధిలోని చేన్నారెడ్డి పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బులెమోని మైసమ్మ జాతర రెండు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి. అందులోని భావంగానే మొదటి రోజు గ్రామంలో ఆడపడుచులంతా కొత్త బట్టలతో ముస్తాబాయి అమ్మవారికి బోనాలతో గ్రామంలో వీధుల గుండా ఊరేగిస్తూ డబ్బు చప్పులతో, పోతురాజు విన్యాసాలతో ఆలయానికి చేరుకుంటారు. తదుపరి భక్తులు బోనంలో తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి చెల్లిస్తారు. అమ్మవారి జాతర మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, ఆలయం దగ్గర కబడ్డీ టోర్నమెంటును నాయకులు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంటులో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతులను ప్రధానం చేస్తారు. ఈ రెండు రోజులపాటు చుట్టుపక్కల వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తారు. జాతర సందర్భంగా భక్తులకు భోజనాలు,అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.