

జనం న్యూస్,ఏప్రిల్ 17,జూలూరుపాడు:
మండల కేంద్రంలోని కోయకాలని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం చేశారు పాఠశాల గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందర చేసి బీరువాలో ఉన్న సౌండ్ స్పీకర్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు గత మూడు నెలల వ్యవధిలో పాఠశాలలో మద్యం సీసాలు,సిగరెట్ వేసి పాఠశాల ఆవరణలో చికాకు చేస్తున్నారని ఈ రోజు ఉదయం పాఠశాలకు వచ్చేసరికి పాఠశాల తలుపు పగలకొట్టి గదులల్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయుడు వాపోతున్నారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు ఫిర్యాదు చెయ్యటంతో పాఠశాలకు వచ్చి పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.