

జనం న్యూస్ ఏప్రిల్ 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండలం కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి దుమ్ములకు మునగాల కు చెందిన తూముల వీరస్వామి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన ఎల్ టి వైర్లు తెగి కింద పడిపోయాయి. మరుసటి రోజు దానిని చూసి ట్రాన్స్ఫార్మర్ ను ఆపు చేయించినారు. గురువారం సుమారు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హార్వెస్టర్ తో పొలం కోపిస్తుండగా హార్వెస్టర్ డ్రైవర్ అయినా లంకెల రాకేష్ గుర్తు తెలియని మృతదేహం పొలంలో ఉందని అతని వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని కుళ్ళిపోయి దుర్వాసన వస్తుందని పొలం యజమాని తూముల వీరస్వామి కి తెలియజేశారు. వీరస్వామి వెంటనే పొలంలో కరెంటు వైర్లు నాలుగు రోజుల క్రితం కరెంటు ఎల్టీ లైన్ తెగిపడి ఉన్నాయని అట్టి కరెంట్ తీగల షాక్కు గురై చనిపోయి ఉండవచ్చని పోలీసులకు సమాచారం ఇచ్చినారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.మృతుడు జీన్స్ ప్యాంటు మరియు టీ షర్టు ధరించి యున్నాడు.ఏమైనా సమాచారం తెలిసినట్లు అయితే ఎస్సై మునగాల 8712686048, సీఐ మునగాల 8712686011, రాంబాబు రైటర్ 9963548638 ఈ నెంబర్లకి సమాచారం ఇవ్వాలన్నారు.