

జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. తీవ్రంగా ఖండించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లు చార్జ్‌షీట్‌లో చేర్చడంతో కాంగ్రెస్ నిరసన చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలోనే కిషన్ రెడ్డిపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం దారుణం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంబకోణలకు కేరఫ్ అడ్రస్ అని నిజాలు బయటపడుతుంటే భరించలేని కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీల ప్రవర్తిస్తూ బిజెపి నాయకులపై, మోదీ పై అశ్లీల పదజాలంతో దుషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు, వీధి గుండాలు వ్యవహారించినట్లు వ్యవహారిస్తే ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. గతంలో బండి సంజయ్. ఆర్ఎస్ఎస్ నాయకులపై కూడా బెదిరింపులకు పాల్పడటం కాంగ్రెస్ గుండా రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేసారు.