Listen to this article

జనంన్యూస్. 17.నిజామాబాదు. సిరికొండ.

సిరికొండ మండలంలోనీ పలు గ్రామాలలో ఎక్కువ వడ్డీతో అప్పులు ఇస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులపై ధర్పల్లి సీఐ ఆధ్వర్యంలో సిరికొండ ఎస్సై ఎల్ రామ్ మరియు పోలీస్ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించగా కుర్దులపేట గ్రామంలో గాండ్ల సతీష్ దగ్గర 83 లక్షల 45000 విలువచేసే ప్రామిసరీ నోట్లు మరియు కొన్ని చెక్కులు లభించాయి అలాగే మైలారం గ్రామానికి చెందిన గడ్డాల గంగా దాస్ గారి దగ్గర 56 లక్షల 18000 విలువచేసే 213 ప్రామిసరీ నోట్లు మరియు గడుకోల్ గ్రామానికి చెందిన మచ్చర్ల గంగారెడ్డి దగ్గర 13,20,000 విలువచేసే 11 ప్రామిసరీ నోట్లు మరియు గడుకోల్ గ్రామానికి చెందిన కామారెడ్డి రాజు దగ్గర 23 లక్షల 80,000 విలువచేసే 14 ప్రామిసర్ నోట్లు లభించగా అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని సిరికొండ ఎస్సై ఎల్ రామ్ గారు తెల్పనైనది మొత్తం268 ప్రామిసరీ నోట్లు వాటి యొక్క విలువ 1,76,63,000 ఉంటుంది ఇకపై నుండి ఎవరైనా అధిక వడ్డీతో వడ్డీ వ్యాపారాలు చేసినట్లయితే ఊరుకునేది లేదని అట్టి వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని సిరికొండ ఎస్ఐ ఎల్ రాం. తెలపనైనది