

జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం పచ్చగా మారిందని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పచ్చదనాన్ని ఎండబెడుతోందని ఆయన ఆరోపించారు.జమ్మికుంట పాత మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో 10 రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తోందంటే అది న్యాయమా?అని ప్రశ్నించారు.కెసిఆర్ హయాంలో చివరి ఆయకట్ట వరకు నీళ్లు, రైతులకు ఉచిత నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించారని గుర్తు చేశారు.కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్న రాష్ట్రాన్ని, కేసీఆర్ పాలనలో 2 కోట్ల 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకువచ్చారు, అన్నారు.రైతుబంధు, రుణమాఫీ, విద్యుత్ సబ్సిడీ, కరెంటు స్థాపన, సించన ప్రాజెక్టులపై మొత్తం రూ.4.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘనత కేసీఆర్‌దేనని వివరించారు. రైతే రాజు అనే నినాదాన్ని కేసీఆర్ కార్యరూపంలో చూపించారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, కెసిఆర్ పాలనతో పోలిస్తే చాలా తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి, చివరి ఆయకట్ట వరకు నీళ్లు, పూర్తిస్థాయిలో సహాయాలు అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్ రావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
