

జనం న్యూస్ ఏప్రిల్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి పోలీస్ స్టేషన్ ను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ వార్షిక తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి ఎస్సై విజయ్ ని అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా… పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా ఉంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రతిఫలం దక్కుతుందని తెలియజేశారు. అదేవిదంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో v ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచాలని తెలిపారు.
