Listen to this article

బిఆర్ఎస్ పార్టీ కంచుకోట హుజరాబాద్..


హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..


జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

ఎల్కతుర్తి బహిరంగ సభతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఎల్కతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కథానాయకులై కదలి రావాలన్నారు.హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారు లక్షమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ కంచుకోట అని ఎల్కతుర్తి జనసముద్రంగా మారాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సిద్ధమన్నారు. 15 నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎర్రవెల్లి కొండారెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.