

జనం న్యూస్;17 ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట
పట్టణం భారత్ నగర్ లోనీ శ్రీవాణి స్కూల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.ఈ కార్యక్రమాలో పిల్లలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సి.హెచ్ సత్యo మాట్లాడుతూ ఈ చిన్నారులు తమ విద్య ప్రయాణంలో మొదటి మెట్టు విజయవంతంగా పూర్తి చేశారు వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , తదితరులు పాల్గొన్నారు