

జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు..
పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద కుటుంబంలో ఉండి పరిస్థితులు బాగోలేక ఆసుపత్రుల పాలైన వారిని సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని అన్నారు. 5 మండలాలు, 2 పట్టణాలకు సంబంధించిన 183 మంది లబ్దిదారులకు, 76 లక్షల విలువచేసే చెక్కులను అందజేశారు. చెక్కులు వచ్చిన వెంటనే లబ్దిదారులకు అందజేస్తున్నామని, వారు వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి 1,500 కోట్లపై చిలుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని, అర్హులైన లబ్ధిదారులకు ఆదుకోవడంలో రాజకీయాలకతీతంగా ఉంటామని, తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే అధికారులకు పంపించి చెక్కులు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
