

జనం న్యూస్ 18 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కోడి రామ్మూర్తి వ్యాయామ సంఘం క్రీడాకారులు పవర్ లిఫ్టింగ్ లో పలు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్ స్టేట్ ఛాంపియన్ షిప్ పోటిలు ఇటీవల గుడివాడలో నిర్వహించిన పోటీల్లో విజయనగరం కోడి రామ్మూర్తి సంఘం అభినవ భీమ పెద్ది లక్ష్మి నారాయణ పర్యవేక్షణలో స్ట్రాంగ్ ఒమెన్ గా జారా, గోల్డ్ మెడల్ సాధించగా ఉదయ్, మరో క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.అతి తక్కువ కాలం 6 నెలల్లో ఈ పతకాలు సాధించారు.రాయే కాలంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని పలువురు కోరారు.అలాగే రామకృష్ణ జాతీయ పవర్ లిఫ్టింగ్ కి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా వీరిని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అభినందించారు.