

ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిజం..
ప్రజా ప్రతిభ రిపోర్టర్ శ్రీరామోజు సతీష్ చారిని అభినందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతిభ కృషి అభినందనీయం…
జనం న్యూస్ 16 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ సీఐ పులి రమేష్ భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిబాబా చేతుల మీదుగా ప్రజా ప్రతిభ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ప్రతిభ దినపత్రిక సంబంధించిన ఎల్కతుర్తి హనుమకొండ ఆర్సి ఇన్చార్జి రిపోర్టర్ శ్రీరామోజు సతీష్ చారి స్థానిక సీఐ పులి రమేష్ కు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐ పులి రమేష్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా ప్రతిభ దినపత్రిక ముందుకు కొనసాగాలని సమాజాన్ని చైతన్య పరిచే ఎన్నో కథనాలను ప్రచురించాలని ఆకాంక్షించారు నిజాన్ని నిర్భయంగా రాయాలని ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రతిభ పేపర్ కృషిని అభినందించారు ప్రజా ప్రతిభ దినపత్రిక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడాన్ని నిష్పక్షపాతంగా ముందుకు పోతున్న ప్రజా ప్రతిభ దినపత్రికను అభినందించారు. అనంతరం ప్రజా ప్రతిభ దినపత్రిక యజమాన్యానికి పాఠకులకు క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న వారితో పాటు ఆంధ్రప్రభ రిపోర్టర్ జనగాని ప్రవీణ్ కుమార్. ఉదయం రిపోర్టర్ కందుకూరి మహేష్ చారి. జనం న్యూస్ రిపోర్టర్ బండి కుమారస్వామి. ఎలక్ట్రాన్ మీడియా చిర్ర ఉదయ చందర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు