

క్రీస్తు ప్రేమ సహవాసము చర్లపాలెం. పాస్టర్ వడ్లకొండ.సామ్యూల్ కిరణ్ సిల్వపై పలికిన సప్త పలుకులు1. యేసు తండ్రి *వీరేమి చేయుచున్నారో .23.342. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు//.23.433. అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాను.19.26 4. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి//మార్క్//15.345. నేను దప్పికొనుచున్నాను// యోహాను15346. తండ్రి నీ చేతికి నా ఆత్మకు అప్పగించుచున్నాను//. 23.467. సమప్తమైనది యోహాను//.19.30జనం న్యూస్ తొర్రూర్ డివిజన్ ప్రతినిధి ఏప్రిల్ 18 తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామంలో క్రీస్తు ప్రేమ సహవాసం చర్చి మందిరంలో వడ్లకొండ సామ్యూల్ కిరణ్ ప్రార్థన చేస్తూ సప్త పలుకులు వివరిస్తూ గుడ్ ఫ్రైడేను ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా సిలువలో మరణించిన దినంగా ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రజల రక్షణ కోసమే వచ్చాడు.ఆయన జీవిత ప్రయాణాన్ని,అర్ధాన్ని మన జీవితాల్లోప్రతిబింబింపజేసుకోవాలన్నదే ఈ ఈ దినము యొక్క అర్థము.యేసయ్య ముప్పైమూడు సంవత్సరాల పాటు ఈ భూమిపై జీవించి,చివరకు మన పాపాలను మోసుకుని,సిలువలో తన ప్రాణాలను సమర్పించారు. ఆయన సిలువలో పలికిన ఏడు మాటలు ఆయన దివ్య ప్రేమను, క్షమాశీలతను,బాధ్యతను మరియు పరిపూర్ణతను గురించి చర్చి పాస్టర్ వడ్లకొండ సామెల్ కిరణ్ చాటిచెప్పరు.మొదట ఆయన “తండ్రీ,వీరిని క్షమించుము.వీరేమి చేయుచున్నారో వీరెరుగరు”అని చెప్పడం,ఆయన క్షమాభావాన్ని తెలియజేస్తుంది.ఆయనను సిలువలో చంపిన వారిని క్షమించమని తండ్రిని ప్రార్థించడం మహా దయకు నిదర్శనం.ఇది మారుమనస్సు గల వారిని ఆయన ఎలా ఆదరిస్తాడో తెలియజేస్తుంది. “నా దేవా,నన్నెందుకు విడిచితివి?” అని ఆయన చేసిన పిలుపు, ఆయన తండ్రితో ఉన్న సంబంధం విరిగిపోయిన బాధను సూచిస్తుంది. “దప్పిగా ఉన్నాను” అని అన్నప్పుడు,ఆయన శారీరక బాధను మాత్రమే కాక, మానవత్వాన్ని వ్యక్తం చేశారు. ప్రార్థన అనంతరం ప్రార్థనకు వచ్చిన వారికి భోజనాలు మరియు జ్యూస్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు చిట్టి మల్ల. సాయిలు . ధర్మారపు ఇద్దయ్య.గంగర బోయిన. యాకయ్య. ధర్మారపు యాకయ్య. వింజమూరి .సుధాకర్. సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు