

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
దగ్గరనున్న స్టడీ సర్కిల్ హాల్ నందు ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉద్యోగస్తుల సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ 1) ఇటీవల విడుదలైన భారత న్యాయ నివేదిక 2025 పేరుతో విడుదలైన నివేదిక ఆధారంగా 140 కోట్ల జనాభాకు 21,285 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారని వెల్లడించింది 2)అమెరికాలో ప్రతి 10 లక్షల మంది పౌరులకు 150 మంది న్యాయమూర్తులు ,ఐరోపాలు 220 మంది న్యాయమూర్తులు పనిచేస్తూ ఉండగా భారతదేశంలో కేవలం 15 మంది న్యాయమూర్తులు అంటే 21,285 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని, 1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ఈ సంఖ్య 50 గా ఉండాలని సూచించింది. 2) ప్రస్తుత భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నారని అంచనా దానిపకారము సుమారు 70 000 మంది న్యాయమూర్తులు సంఖ్య అవసరం
3) ప్రస్తుతం వివిధ సామాజిక వర్గాల నుండి న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా గత సెన్సెస్ ప్రకారం సుమారు 15%ఎస్సీ సామాజిక వర్గము నుండి10,500 మంది న్యాయమూర్తులు,
7%ఎస్టీ సామాజిక వర్గం నుండి 4,900మంది న్యాయమూర్తులు , 27%బీసీ సామాజిక వర్గము నుండి18,900 మంది న్యాయమూర్తులు, 18% ముస్లిం మైనారిటీ ఇతర సామాజిక వర్గాల నుండి 12,600 మంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ప్రతిభావంతులైన ఆయా సామాజిక వర్గాలవారికి న్యాయమూర్తి పదవులను పొందే అవకాశం ఉంటుందని. 4)ఇంత కాలము ఈ అవకాశాలకు కోల్పోయిన సామాజిక వర్గాలు అసంతృప్తితో రగిలి పోతున్నాయని,ఈ విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగణన తో పాటు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎం ప్రసన్నకుమార్ కె విజయ్ కుమార్ జి అనిల్ కుమార్ కె అనిల్ కుమార్