

యువత ఆన్లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలి
సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్
జనం న్యూస్, ఏప్రిల్ 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్, సమాజంలో యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిపోతు ప్రాణాలు…అప్పుల ఊబిలో చిక్కుకొని ఎన్నో కుటుంబాలు ఆగం అవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంగా
లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సమర్పణలో దర్శక నిర్మాత బీరప్ప రూపొందించిన “బెట్టింగ్ మాయ”షార్ట్ ఫిల్మ్ ను శనివారం మండల కేంద్రం లోని మల్లన్న దేయాలయం వద్ద జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, శైలగిరి హాస్పటల్ యాదగిరి లు విడుదల చేశారు. అంతకు ముందు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ , శైలగిరి ఆస్పటల్ డాక్టర్ యాదగిరి చిత్ర బంధం సభ్యులందరూ మల్లన్న స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు గ్రామాలలో విద్యార్థులు, యువత ఆన్లైన్ బెట్టింగ్, జూదం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ …ఉన్నదంతా పోగొట్టుకొని అప్పుల ఉభిలో కూరుకుపోతున్నారు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ యాప్ లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుని అప్పుల లోన్లు ఇచ్చినోళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారని తెలిపారు.
కొడుకులు చేసిన అప్పులు తల్లి తండ్రుల ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటన లు మారేనా ఇంట్లో ఒక్కరి వ్యసనం…మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతోంది దాంట్లో భాగంగానే ” బెట్టింగ్ మాయ” షార్ట్ ఫిలిం లో చాలా బాగా అర్థం అయ్యలే మూవీ సూపించారని చెప్పారు, ఇంతా శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు అని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా ప్రజలకు ఆన్లైన్ బెట్టింగ్ వల్ల మంచి అవగాహన కలుగుతుందని సూచించారు. ఇంత శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ప్రజలను మాత్రం మార్పు రావడంలేదని ఆయన పేర్కొన్నారు, సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి షార్ట్ ఫిలిం లు ఇంతకుముందు “సలాం పోలీస్,” కను విప్పు” లాంటి షార్ట్ ఫిలిం లు తీసి ప్రజలకు మంచి అవగాహన కల్పించే విధంగా తీశారని పేర్కొన్నారు.యువత కు విద్యార్థులకు,ప్రజలకు ఉపయోగ పడే విధంగా మరిన్ని షార్ట్ ఫిల్మ్ లు తీసి ప్రజలకు అందించాలని కోరారు. ఎప్పుడూ ఎలాంటి అవసరం వచ్చిన మా వంతు సహాకారాలు ఉంటాయని తెలిపారు. అనంతరం దర్శక నిర్మాత బిరప్ప మాట్లాడుతూ ఈ చిత్రానికి సహకరించిన శైల గిరి హాస్పిటల్ డాక్టర్ యాదగిరి మరియు చిత్ర నటులు బండారి బిక్షపతి, శంకరమ్మ, గడ్డం స్వామి,పద్మ,సోని,రమేష్,భాను,లక్ష్మి, మౌనిక ,భరత్,రామచంద్రం, కలీం, అజీమ్, లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.