

జనం న్యూస్ ఏప్రిల్ 19(నడిగూడెం)
పిఎసిఎస్ ఆధ్వర్యంలో అందిస్తున్న దీర్ఘకాలిక ఋణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గోసుల రాజేష్ అన్నారు.శనివారం మండలంలోని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులైన మేకల గోవర్ధన్ కు మంజూరు అయిన ఋణం 8 లక్షల రూపాయల చెక్కును,రణబోతు సునీత కు మంజూరి అయిన 8 లక్ష రూపాయల చెక్కులను చైర్మన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి సంధ్య లింగారెడ్డి, సీఈవో శ్రీనివాసరావు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.