

విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్
జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
తే. 19-04-2025 దిన విజయనగరం 1వ పట్టణ ఎస్ఐ వి.ఎల్ ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది పట్టణంలో గూడ్స్ షెడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విజయనగరం కలెక్టరు ఆఫీసు రోడ్డు వైపు నుండి గూడ్స్ షెడ్ వైపు స్కూటీపై వస్తున్న ఒక వ్యక్తి మరియు జ్యూవినల్ పోలీసులను చూసి ఆపకుండా పారిపోయినట్లు, వెంటనే సదరు స్కూటీపై వెళ్తున్న వారిని పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు రెండు కేజీల గంజాయి ప్యాకెట్టు దొరికినవి. సదరు వ్యక్తులను విచారించగా వారు విజయనగరం పట్టణానికి చెందిన (1) వాసుపల్లి విజయ్ వయస్సు 19 సం||లు, శాంతినగర్ అని తెలిపారు. సదరు ముద్దాయిపై ఇది వరకే గంజాయి కేసు ఉన్నట్లు తెలిపారు. ఇరువురిని అదుపులోకి తీసుకొని వారిని రెవిన్యూ అధికారుల సమక్షంలో తనిఖీ చేసి రెండు కేజీల గంజాయిని, స్కూటీని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్టు చేసి రిమాండు నిమిత్తం కోర్టుకు తరలించడం అయ్యిందని విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.