

జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిందాల్ పరిశ్రమ లాకౌట్ ఎత్తివేసి పరిశ్రమను కొనసాగించాలని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కొత్తవలసలో జిందాల్ పరిశ్రమను లాకౌట్ చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల కార్మికుల జీవితాలు రోడ్డుపై పడతాయని అన్నారు. వెంటనే పరిశ్రమ కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.