

జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ 16347 పోస్టులు భర్తీ చేయాలని. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి.కొండపల్లి శ్రీనివాస్ గారికి డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్, డీఎస్సీ అభ్యర్థులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో హరీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ చేయాలని పోరాటం చేసి డీఎస్సీ 6000 పోస్టులకు గాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీశారు. ఎన్నికలు వస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తీసిన పోస్టులను రద్దుచేసి సూపర్ సిక్స్ లో భాగంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచిన మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని ఇలాంటప్పుడు వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులందరూ .రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు . ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉందని, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ క్లియర్ చేసి ఇస్తామని. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారానికి నోటిఫికేషన్ ఇస్తామని జూన్ నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 15/4/25 వర్గీకరణ కేంద్ర ఆమోదించింది.. ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అని అన్నారు
జిల్లా లో దాదాపు గా 20 వేల నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం యధురు చూస్తున్నారు.. అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉందని గత ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో ఒక వైపు కుటుంబం నుంచి ఒత్తిడి మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ హామీలు నమ్మి నోటిఫికేషన్లు వస్తాయని సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకోని విలువైన సమయాన్ని, డబ్బులను పోగొట్టుకోని ఏమి చేయాలో తెలియని పరిస్థితి నిరుద్యోగుల కు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా డీఎస్సీ 16, 347 పోస్టులు భర్తీ చేసే నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు…. ఈ కార్యక్రమంలో మురళి, నరేష్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు….