

జనం న్యూస్ 20 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్సీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కనీస వేతనం రూ. 300 ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ వేతనదారులకు అతి తక్కువ డబ్బులు చెల్లిస్తున్నారన్నారు. దీనిపై జిల్లాలో ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని మండిపడ్డారు.
గ్రామాల్లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.