

ప్రమాదాలకు రాంగ్ రూట్ కారణమా..
వాహనదారులకు అవగాహన లోపమా..
ఒకే రోజు 2 ప్రమాదాలు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 21 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట నుండి వావిలాల కు మరియు హుజురాబాద్ కి వెళ్ళు ప్రయాణికుల వాహనదారులు ఆర్ఓబి బ్రిడ్జి పై అతివేగం వాళ్ళ, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. జమ్మికుంట పట్టణం లో బ్రీజ్జి నిర్మాణమే ఇందుకు కారణమా అర్ధం కావట్లేదు.వాహనదారులకు అవగాహన లేకుండా కార్లు, బైకులు, ట్రాక్టర్లు, లారీలు, అధిక వేగంతో ప్రయాణిస్తున్నారు. ఇందుకుగాను నిత్యం ఏదో ఒక ప్రమాద రూపంలో సంఘటనలు జరుగుతూ ప్రజలు మరణిస్తున్నారు, ప్రతిరోజు ఒక్క ప్రమాదం జరుగుతుంది.అయిన జమ్మికుంట ఆర్ఓబి బ్రిడ్జి, పై వెళ్లాలంటే మృత్యువు ఏ రూపంలో వస్తుందో అని ప్రయాణికులు భయపడుతున్నారు. కారణం వాహనదారులకు అనుభవం అవగాహన లేకపోవడమా, అనేది ప్రధాన కారణమా, మారింది. జమ్మికుంట సిటీలో( బ్రీడ్జ్ ) నిర్మించడం వలన ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నయి, అనేది ప్రయాణికుల మాట్లాల్లో అర్ధం అవుతుంది. అదే అవుటర్ ,ఉండేటట్టు ఉంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేది కాదు ఏమో, అని ప్రజా అభిప్రాయం. ఇది ఇలా ఉండగా, వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు వావిలాల నుండి జమ్మికుంటకు వస్తున్న కారు, రాంగ్ రూట్లో వచ్చి, కొత్తపల్లి వైపు వెళ్తున్న ఆటోను, ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్ కు భుజానికి తీవ్ర గాయం అయింది. ఇందుకు కారణం కారు రాంగ్ రూట్లో రావడమే,, ఇటువంటి యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని అధికారులు పోలీసులు, వాహనదారులపై ఒక కన్నేసి రాంగ్ రూట్లో వెళ్లే వారికి చలాన్లు, విధిస్తూ అధిక స్పీడుతో ప్రయాణికులను భయాందోళనలకు గురి చేస్తున్న, ఇసుక ట్రాక్టర్లను సైతం, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఒక పోలీసును ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు ప్రయాణికులు వాపోతున్నారు.ఇదే రోజు జమ్మికుంట ప్రధాన రహదారి హుజురాబాద్ నుచ్చి జమ్మికుంట కి వస్తున్న, ఆగి ఉన్న అర్ టి సి బస్సు కి వెనుకనుంచి అతి వేగంతో వచ్చి,, ద్వి చక్రవాహం ఢీ కొట్టగానే ఆ వాహనాంపైన ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఆగిన వాహనదారులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు, ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.