Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 20. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి – 2025 నూతన రెవెన్యూ చట్టంపై ఆదివారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అన్నదాతల పాలిట శత్రువులా తయారై వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని అన్నారు. రైతులకు దాని నుంచి విముక్తి కలిగించి భూములపై ఎలాంటి సమస్యలు లేకుండా వారికి హక్కులు కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేస్తుందన్నారు. రైతుల పక్షపాతిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎవరు కూడా బాధపడొద్దన్నారు. సాదా బైనామాలు పరిష్కరించేందుకు త్వరలో మార్గదర్శకాలు రానున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా భూములకు భూధార్ నంబర్ రానుందని,హద్దులు సైతం వస్తాయని వివరించారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో. ఆర్డిఓ.మహిపాల్ రెడ్డి. ప్రభుత్వ అధికారులు.కౌడ్డిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రావు.నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల మైనార్టీ అధ్యక్షులు అజ్మత్ అలీ. పాషా,మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు,నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు తదితరులు పాల్గొనారు.