

జనం న్యూస్ 21 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం, ఏప్రిల్ 20: ఒక తల్లి ఊరు గాని ఊరు విడిచి అనేక ఊళ్ళు తిరుగుతూ చివరికి ఒక ఊరుకి చేరింది. అందమైన చీర కట్టు, రూపంతో ఉన్న ఆమె ఆ ఊళ్ళో అక్కడ ఇక్కడ తిరుగుతూ చివరికి ఒక రోజు చినిగిన బట్టలతో దేహంపై తీవ్ర గాయాలతో రోదిస్తూ అక్కడి స్థానికులకు కనిపించింది. దీంతో ఆమె ధీన స్థితిని గమనించిన కొందరు చలించిపోయి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ వారి సహకారంతో జిల్లా కేంద్ర హాస్పిటల్ లో ఆమెను చేర్పించి చికిత్స అందించారు. ఐతే ఆమె త్వరగానే కోలుకుని సాధారణ స్థితిలోకి వచ్చాక ఏదైనా అనాథ ఆశ్రమంలో చర్చిద్దామని ఆమెను పర్యవేక్షించిన వారు భావించారు. కానీ పరిస్థితి విషమించి ఆమె శనివారం మరణించింది. ఇదంతా ఇటీవల జామి మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఒక మహిళ ఉదంతం. ఆ ఘటన తర్వాత ఆమె పేరు కరీమున్ అని, ఆమెది బాపట్ల జిల్లా ఇంకోలు మండలం కొణికి గ్రామం అని తెలియ వచ్చింది. వివాహితురాలైన ఆమె నిరుపేద ముస్లీం కుటుంబంకి చెందినదాయని, ఆమెకు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఐతే కొన్నాళ్ళు క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన ఆమె జామి మండల కేంద్రానికి చేరుకుందని, అక్కడ మంచి వస్త్రధారణ తో తిరుగుతూ ఉండేదని, ఐతే ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తిరుగుతూ ఉండడంతో స్థానికులు మతిస్థిమితం లేని వ్యక్తిగా భావించేవారు. ఐతే దాదాపు మూడు వారాల క్రితం కరీమున్ గాయాలతో కనిపించడంతో చలించిన స్థానిక విలేకరి రమణ స్థానికులు, పోలీస్ ల సహకారంతో ఆమెను హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందించారు. కానీ చివరికి ఆమె మృతి చెందారు. ఐతే మృతి వార్త తెలిసిన ఆమె బందువులు ఇక్కడకు చేరుకున్నా, వారి పేదరికం వల్ల మృత దేహాన్ని తమ గ్రామానికి తీసుకు వెళ్ళే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న యూత్ ఫౌండేషన్ షేక్ ఇల్తామష్ తమ ముస్లీం పెద్దలకు తెలియచేసి వారి సహకారం ద్వారా సమకూరిన కొంత ధనంతో కరీమున్ స్వగ్రామానికి ఆమె మృత దేహాన్ని తరలించడానికి ఫ్రీజర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఆమెకు ఇక్కడ నుంచి అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మానవత్వంతో సకాలంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన
ఏటీకే అధ్యక్షులు ఏం డీ ఖలీల్ బాబు, షేక్ ముజ్జు, రాఖీబ్, నయీమ్, రెహమాన్, ఇర్ఫాన్, మెహబూబ్ షరీఫ్( చిస్తీ) తదితరులకు ఇల్తమాష్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్లు విజయ్, షఫీ, విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు రాయల్ క్యాబ్స్ శరత్,అశోక్, సాయి, రాము, రఘు, పీ.రఘు, విజయ్ కాంత్, వర్మ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.