

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
చిలకలూరిపేట ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్.
సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)
రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి 9వ తేదీన వరకు జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ ప్రధమ మహాసభలు ఈ నెల 21వ తేదీన వినుకొండ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు శివయ్య స్తూపం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మహాసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఏఐవైఎఫ్
అధ్యక్ష కార్యదర్శులు సౌటు పల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్ తెలిపారు. రాష్ట్ర మహాసభల గోడ పాత్రాలను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు పోరాటాలు రూపొందించుకొని ముందుకు సాగడం జరుగుతుందని ఆయన తెలిపారు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్
పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.