

జనం న్యూస్ ఏప్రిల్ 21 నడిగూడెంకు చెందిన
వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య కి సోమవారం హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీటీ కల్చరల్ సెంటర్ కళాభారతి లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆ సంస్థ ఫౌండర్ డాక్టర్ ఆలూరి విల్సన్, సలహాదారు ఇందిర, సంస్థ ప్రతినిధులు, పలువురు రచయితలు, సినీ, బుల్లి తెర గాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపయ్య విలేకరులతో మాట్లాడుతూ తాను గత రెండున్నర సంవత్సరాలనుండి చేపట్టిన ప్రకృతి వ్యవసాయం పై రైతు చైతన్య కార్యక్రమానికి గుర్తింపు గా ఈ అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.