Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషన్లో 2024 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కింతలాంబ గ్రామానికి చెందిన కిల్లక మోహనరావు అలియాస్ మోహన్ (29నం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 10సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,000/-లు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 21న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ మార్చి 28న తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన 16 సంవత్సరాల బాలిక పార్వతీపురం పట్టణంలో ఏకలవ్య స్కూల్లో చదువుతున్నట్లు, ఆమె ఆవసరాల కోసం తన మామయ్యను రూ.3000/- లు కావాలని అడుగ్గా తన మామయ్య ఫోన్ ఫే ద్వారా బొబ్బిలిలో ఉంటున్న నిందితుడు మోహన్ కు పంపినట్లు, సదరు డబ్బులు తీసుకొనేందుకు ఆమె పార్వతీపురం నుండి బొబ్బిలికి వచ్చి, పట్టణంలో ఉంటున్న తన మామయ్య స్నేహుతుడు కిల్లక మోహనరావు అలియాస్ మోహన్ (29సం||లు) వద్దకు వెళ్ళగా, డబ్బులు ఇస్తానని చెప్పి ఆమెను రూమ్ కు తీసుకువెళ్ళి, బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లు, జరిగిన విషయాన్ని తన మామయ్యతో చెప్పగా వెంటనే 112 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయగా పార్వతీపురం పోలీసులు వచ్చి రిపోర్టు తీసుకొని జీరో ఎఫ్ఐఆర్
నమోదు చేసి, బొబ్బిలి పోలీసు స్టేషనుకు ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపై బొబ్బిలి ఇన్స్పెక్టరు కె.సతీష్ కుమార్ పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను ఆరు మాసాల్లో పూర్తి అయ్యే విధంగా బొబ్బిలి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరు కె.సతీష్ కుమార్ చర్యలు చేపట్టగా, నిందితుడు కిల్లక మోహనరావు అలియాస్ మోహన్ (29సం||లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడి నట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 10 సం.లు కఠిన కారాగారం మరియు రూ.2,000/- ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ.5లక్షల నష్ట పరిహారంను మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, బొబ్బిలి ఇన్స్పెక్టరు కె.సతీస్ కుమార్ పర్యవేక్షణలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎం.మన్మధరావు, సి.ఎం.ఎన్. హెడ్ కానిస్టేబులు సిహెచ్.రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసువారి
తరుపున వాదనలు వినిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్మెట్టా ఖజానారావు, ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు అభినందించారు.