Listen to this article

జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

వారి హౌస్ అరెస్టు నేపథ్యంలో వారి నివాసానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు మరియు పార్టీ నాయకులు….ఈరోజు గట్టు మండలం బల్గెర గ్రామంలో శ్రీశ్రీశ్రీ దిగంబర స్వామీ జాతర సందర్భంగా ఈరోజు నుంచి నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని వారి స్వగృహం నందు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి,వారిని హౌస్ అరెస్టు చేశారు..బాసు హనుమంతు నాయుడు హౌస్ అరెస్టు నేపథ్యంలో వారి స్వగృహానికి పార్టీ నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఊరి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రైతు సంబరాలు నిర్వహిస్తే ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు…? ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ లతో మీ అక్రమ హౌస్ అరెస్టులతో ప్రజాపాలన కొనసాగించలేరని మండిపడ్డారు… రైతులను ఆదుకునేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు కానీ,రైతుల సంతోషం కొరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బండ లాగడు పోటీలు పోలీసులను పంపి ఆపడం ఏమిటని ప్రశ్నించారు….