Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 22

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందిస్తున్న బీసీ కార్పొరేషన్ ప్రొసీడింగ్స్ కార్యక్రమానికి విచ్చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, ఈపిఓఆర్డీ టీ సుకుమార్ ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి పుష్పగుచ్చం తో సాధర స్వాగతం పలికారు అనంతరం బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మండలం లో 30 మంది బిసి లకు సబ్సిడీ బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం జరిగిందని అందులో 19 మందికి ప్రొసీడింగ్స్ వచ్చాయని, 11మంది లబ్ధిదారుల వి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు కూటమి ప్రభుత్వం వెనుక బడిన కులాలకు సబ్సిడీ ద్వారా చేయూత ను ఇచ్చి వారిని ఆర్ధికంగా రాణించేందుకు కృషి చేస్తుందని అందుకే కార్పొరేషన్ సబ్సిడీ ద్వారా మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకునేందుకు ప్రోత్సాహంకల్పిస్తుందని వీటితో పాటు రూ.8 లక్షల యూనిట్‌ విలువతో జనరిక్‌ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు అని బీ ఫార్మసీ చేసిన నిరుద్యోగులకు జనరిక్‌ మందులు దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందజేసారని,గొర్రెల పెంపకం, మినీ డెయిరీ, మోడ్రన్‌ పవర్‌ లాండ్రీ, ఆటో, టాటా ఏస్‌, వెదురు బుట్టల తయారీ, సెల్‌ ఫోన్‌ రిపేర్‌ వంటి 52 రకాల స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలను మంజూరు చేయటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంట్ టిడిపి సభ్యులు కంచర్ల కాశయ్య,టిడిపి మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి,మాజీ జడ్పిటీసి రావి బాషాపతి రెడ్డి,యూత్ అధ్యక్షులు మేకల వెంకట్,టిడిపి వాణిజ్యవిభాగం సభ్యులు పి గోపినాధ్, ఎస్ ఏం సి చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య, టిడిపి నాయకులు కాలంగి శ్రీనివాసులు, గుఱ్ఱపూసల నరసింహ,గ్రామ కమిటీ అధ్యక్షులు గౌతుకట్ల సుబ్బయ్య,నంద్యాల కాశయ్య,కార్యదర్శి ఈర్ల పెద్ద కాశయ్య,బూత్ కమిటీ సభ్యులు షేక్ ఖాసిం వలి,బొంబాయి వలి, జాన్, కుందురు పెద్ద సత్యనారాయణ రెడ్డి,కోటపాటి వెంకటేశ్వర రెడ్డి, కుందురు చిన్న కాశీరెడ్డి, జనసేన నాయకులు గుంటు మోషే, గంజరపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు