

జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా
చావు రోజే తద్దినం తద్దినం రోజే చావు మరణించిన వారి చివరి చూపులు చూసి మరుసటి రోజులలో చివరి చూపులు చూసిన వారి మరణాలు అపరిశుభ్రతగా వస్తున్న భగీరథ నీటి వాడకాన్ని గ్రామ ప్రజలు తగ్గించాలి
మల్దకల్ మండలం నేతివాని పల్లి గ్రామంలో వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి తక్షణమే గ్రామ ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయాలని కామ్రేడ్ రంగన్న డిమాండ్ చేస్తున్నారు.నేతువానిపల్లి గ్రామ సెక్రెటరీ ని గ్రామ ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చరవానిలో రిక్వెస్ట్ చేసిన కమ్యూనిస్టు నాయకుడు రంగన్న గుడి ముందర ద్వజ స్తంభాన్ని ఎత్తడంలో (నిలబెట్టడంలో) గ్రామస్తులు నిర్లక్ష్యం వహిస్తున్నందు వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తుల అనుమానం- ఇది కారణం కాదని గ్రామస్తులకు తేల్చి చెప్పిన ఎల్కూర్ రంగన్న సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) 🚩🚩🚩🚩🚩 మల్దకల్ మండల కార్యదర్శి గుంటన్నగారి రంగన్న (కామ్రేడ్) నేతువానిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆరా తీశారు.తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం, నేతివాన్ పల్లి గ్రామంలో వివరాల్లోకి వెళ్లగా……..1) బోయ కురుమన్న తేది:16-3-2025 న ఆయాసం కారణంగా మరణించడం జరిగింది. ఇతనికి కళ్ళు తాగే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 2) బోయ నారాయణమ్మ 75 సంవత్సరాలు 10-4-2025 న ఉదయం 9 గంటల సమయంలో అకస్మాత్తుగా మరణించడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 3) బోయ దుల్లప్ప 70 సంవత్సరాలు 11-4-2025 న మంచంలో పాటుపడుతూ మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతడికి కళ్ళు మందు బీడీలు తాగే అలవాటు ఉందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 4) బోయ కొత్త బాయి సవారమ్మ 14-4-2025 న (motions) బేధులకు కావడంతో ఆరోజు ఇంటి దగ్గరే మరణించింది అని కుటుంబ సభ్యులు తెలిపారు.
5) బోయ జయలక్ష్మి ఈమెకు ఐదు నెలల గర్భం తొలగడానికి గర్భనిరోధక మందులు వాడడంతో రక్తహీనతతో ఇంటి దగ్గరే 17-4-2025 న చనిపోయిందని సమాచారం. 6) బోయ మీరన్న వయస్సు 45 సంవత్సరాలు. చిన్న అనారోగ్య సమస్య ఉందని గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం సిటీ స్కాన్ ప్రైవేట్ లో చేయగా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే వైద్య సిబ్బంది 17-4-2025 న అతనికి తలలో గడ్డ ఉందని చెప్పి మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కి వెళ్లాలని ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 11 గంటల సమయంలో డిశ్చార్జ్ చేయగా మరుసటి రోజు 18-4-2025 న ఇంటి దగ్గరే హాస్పిటల్ కి వెళ్లాలని ఆలోచించే లోపే ఇతడు మరణించడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్కూరు రంగన్న కమ్యూనిస్టు నాయకుడు మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న భగీరథ నీటి వాడకాన్ని తగ్గించాలని, వేడి చేసుకుని చల్లారిన తర్వాత నీటిని తాగాలని మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేస్తూ భయాందోళనకు గురి కావద్దని పంట పొలాల దగ్గర ఉన్న బోర్ల దగ్గర నీటిని తెచ్చుకుని తాగుతూ వంటలకు కూడా ఆ నీటిని వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మీ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ నాయకుడు బి తిమ్మప్ప. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎల్కూర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.