Listen to this article

జనం న్యూస్ ;22 మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ::

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో బడిపిల్లలు వ్రాసిన బక్రిచెప్యాల బాదుషాలు బడిపిల్లల కథలు పుస్తకావిష్కరణ జరిగింది.సాహిత్యం విస్తృతంగా అభివృద్ధి జరిగితే నైతిక విలువలు పెంపొందుతాయని అందుకు బక్రిచెప్యాల బాదుషాలు బడి పిల్లల కథలే నిదర్శనమని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సార్ అన్నారు.ఈరోజు బడి పిల్లలు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బాల్యం నుండే బాలసాహిత్యం విరివిగా విద్యార్థులకు ప్రచారం జరిగితే అనేక గ్రంథాలు వెలుగులోకి వస్తాయని,చక్కని రచనలు చేస్తే సమాజంలో అవినీతి తగ్గించవచ్చని పాఠశాలప్రధానోపాధ్యాయులు డి.నాగేందర్ రెడ్డి అన్నారు. పుస్తక సంపాదకులు వరుకోలు లక్ష్మయ్య గారిని అందరూ అభినందించారు.ఇట్టి కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, పూర్ణచందర్రావు,అనిల్ కుమార్,సుహాసిని,శ్రీశైలం, రమాదేవి,రాజేందర్,వరుకోలు లక్ష్మయ్య,సునీత,ఆగయ్య, శ్రీనివాస్,ఆంజనేయులు,సరిత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.