Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 :

మండల పరిధిలోని టీఎల్ పేట గ్రామం నుంచి వివిధ గురుకుల విద్యాలయాలలో సీట్లు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను మంగళవారం ఆ గ్రామ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎమ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ గ్రామం నుంచి 16 మంది విద్యార్థులు గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాయగా, 16 మంది సీటు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో 11 మంది ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరిని హెచ్ఎం, వి.శ్రీదేవి, ఉపాధ్యాయులు జి.రవిలాల్, కే.రమణమ్మ తదితరులు అభినందించారు.బాలికల విభాగంలో జిల్లా టాపర్ గా నిలిచిన ఈ పాఠశాల కు చెందిన విద్యార్థిని వడ్డే గుణవర్షితను ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరారు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచి గురుకుల సీట్లు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ఫేర్ వేల్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు ఆనందోత్సహాలతో నృత్యాలు చేశారు.