Listen to this article

జనం న్యూస్ – ఏప్రిల్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ దాసరి రాజశేఖర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాలలో మూడవ స్థానంలో నిలిచిందని, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నీలకుర్తి సహస్ర 982 మార్కులతో నల్లగొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానం సాధించిందని బైపీసీ విభాగంలో పి నాన్సీ 971 మార్కులతో నల్లగొండ జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిందని, కాలేజీ మొత్తం పర్సంటేజీ 64.58, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కళాశాల అధ్యాపక సిబ్బందిని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దాసరి రాజశేఖర్ అభినందించారు.