

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గారు తేది 16.12.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి రాధిక కు భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ మరియు కార్పస్ ఫండ్ 50,000, విడోవ్ ఫండ్ 10,000 మొత్తం 8,60,000 విలువ చేసే చెక్కు ను ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్., జిల్లా పోలీస్ కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ గారు అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ అంజన్న , జిల్లా పోలీసు కార్యాలయ ఎ.ఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ, సీసీ కిరణ్ లు పాల్గొన్నారు.